వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్ కు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. శుక్రవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ జట్టుకు 20% ఫైన్ విధించింది. నిర్నిత సమయం కంటే పాక్ 4 ఓవర్లు ఆలస్యంగా వేయడంతో ప్రతి ఓవర్ కు 5% చొప్పున ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఫీజులో కోత విధించినట్లు ఐసీసీ పేర్కొంది.
తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 31న బంగ్లాదేశ్ తో ఆడనుంది. కాగా ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్ అయినట్లే కనిపిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ కు మరో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో చిత్తై టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.