World Cup 2023 : నేడు హైదరాబాద్‌లో వరల్డ్ కప్ మ్యాచ్

-

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇవాళ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా రెండవ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు హైదరాబాద్ వేదిక కానుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. నెదర్లాండ్స్ తో పోలిస్తే పాకిస్తాన్ అన్ని విభాగాలలో చాలా బలంగా కనిపిస్తోంది. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని… భారీ స్కూలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుంటే ఆ జట్టు విజయం సాధిస్తుందని కూడా చెబుతున్నారు. కాగా వామాప్ మ్యాచ్లలో… పాకిస్తాన్ ఘోర పరాజయాలను చవిచూసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news