బెట్టింగ్ యాప్ కేసులో ​కపిల్ శర్మ, హ్యూమా ఖురేషికి ఈడీ సమన్లు

-

బాలీవుడ్​లో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు నటులకు ఈడీ సమన్లు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కమెడియన్ కపిల్ శర్మ, నటీమణులు హూమా ఖురేషి, హీనా ఖాన్‌లకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ మనీలాండరింగ్​ కేసు విచారణకు సంబంధించి కమెడియన్​ కపిల్​ శర్మతో పాటు హూమా ఖురేషి, హీనా ఖాన్‌లను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్​ నటుడు రణ్​బీర్ కపూర్​కు అక్టోబర్​ 4వ తేదీన ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్​ 6వ తేదీన రాయ్‌పుర్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు పేర్కొనగా.. అందుకు రణ్​బీర్​ రెండు వారాల సమయం కోరినట్లు సమాచారం.

బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న భారీ స్కామ్​ను ఈడీ ఇటీవల బయటపెట్టిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ యూఏఈలోని దుబాయ్‌ కేంద్రంగా దేశంలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు.. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news