పాక్ ఆర్థిక మంత్రికి అమెరికాలో అవమానం.. ‘దొంగ’, ‘అబద్ధాలకోరు’ అంటూ నినాదాలు

-

వాషింగ్టన్ ఎయిర్ పోర్టులో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ హల్ చల్ చేశాడు. కొంత మందిని బండ బూతులు తిడుతూ…. కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. IMF (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) మరియు ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అమెరికాకు తాజాగా చేరుకున్నారు.

అయితే.. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ కు ఘోర అవమానం ఎదురైంది. ‘నువ్వు ఒక అబద్దాలకోరు. నువ్వు దొంగవి’ అంటూ వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన పాకిస్థాన్ మంత్రికి వ్యతిరేకంగా కొంత మంది వ్యక్తులు నినాదాలు చేశారు. వాషింగ్టన్ విమానాశ్రయంలోనే పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్‌ను ‘దొంగ’, ‘అబద్ధాలకోరు’ అంటూ వారు అరిచారు. దీంతో ఆగ్రహానికి గురైన పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్.. వారిని బండ బూతులు తిట్టి, హాల్‌ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version