కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. వరుసగా ఆరోసారి ఆమె పద్దును ప్రవేశపెట్టి మెురార్జీ రికార్డును సమం చేశారు. మన్మోహన్, జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా రికార్డును నిర్మల అధిగమించారు. డిజిటల్ రూపంలో బడ్జెట్ కాపీ అందుబాటులోకి తీసుకువచ్చారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌లో కీలక శాఖలు,పథకాలకు జరిపిన కేటాయింపులు.
- రక్షణః రూ 6.2 లక్షల కోట్లు
- ఉపరితల రవాణా,జాతీయ రహదారులుః రూ. 2.78 లక్షల కోట్లు
- రైల్వేః రూ. 2.55 లక్షల కోట్లు
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీః రూ. 2.13 లక్షల కోట్లు
- హొం శాఖకుః రూ. 2.03 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్దిః రూ. 1.77లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువులుః రూ. 1.68 లక్షల కోట్లు
- కమ్యూనికేషన్లుః రూ. 1.37 లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతు సంక్షేమానికిః రూ. 1.27 లక్షల కోట్లు
- గ్రామీణ ఉపాధి హామీ పథకంః రూ. 86 వేల కోట్లు
- ఆయుష్మాన్ భారత్‌ః రూ. 7,500 కోట్లు
- పారిశ్రామిక ప్రోత్సాహకాలకుః రూ. 6,200 కోట్లు
- సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకిః రూ. 6,903 కోట్లు
- సోలార్ విద్యుత్ గ్రిడ్‌కిః రూ. 8,500 కోట్లు.