విప్లవ వీరులు గద్దర్ విగ్రహాన్ని బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు చనిపోతారు. కానీ మరణించి కూడా ఎవరైతే మనసుల్లో భావితరాల మనుగడలో బతికే ఉంటారో వాళ్ళే అమరులు. అలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు. నిజానికి వీరుడిలా ఒక్క క్షణం బతికినా చాలు బానిస సంకెల్ని తెంచేసి ఆఖరి శ్వాస దాకా సమాజం కోసం బతికారు తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్. ఈరోజు మహనీయుని విగ్రహావిష్కరణ విజయవంతంగా జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో పఠాన్ చెరువు నియోజకవర్గం లో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజాయుద్ధనౌక గద్దర్వి గ్రహాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ వేడుకలో మంత్రులు మేధావులతో పాటుగా కవులు, కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ప్రసంగిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గద్దర్ జయంతిని విజయవంతంగా పురస్కరించుకున్నామని అన్నారు. గతంలో కూడా ఆ ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి తాను వచ్చినట్లు చెప్పారు.