పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఇదే

-

సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశాలకు సంబంధించిన ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాల్లో మొదటి రోజు ’75 ఏళ్ల పార్లమెంట్ ప్రయాణం’ అనే అంశంపై చర్చించనున్నట్లు తెలిపింది. రాజ్యాంగ సభ ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ ఘటనలపై సభ్యులు మాట్లాడనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2023-పోస్ట్ ఆఫీస్ బిల్లు, ప్రెస్ రిజిస్ట్రేషన్లు, పీరియాడికల్స్ బిల్లు, ది అడ్వొకేట్స్ బిల్లులు ఈ అజెండాలో ఉన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో కాకుండా కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ లాంటి అంశాలను ప్రభుత్వం సభ ముందుకు తేవొచ్చని ప్రచారం జరిగినా.. తాజాగా ప్రకటించిన అధికారిక ఎజెండాలో అవేవీ కనిపించ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version