Jamili Elections: లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి

-

Jamili Elections: లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి వచ్చింది. ఓటింగ్‌ లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో… “129 వ రాజ్యాంగ సవరణ బిల్లు” కు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చారు స్పీకర్‌ ఓం బిర్లా.

Voting process on Jamili Election Bill begins

జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా 220 సభ్యుల మద్దతు వచ్చింది, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. ఈ తరుణంలోనే… సాధారణ మెజారిటీ తో బిల్లు కు అనుమతి వచ్చింది. ఇక అటు జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు  వ్యతిరేకంగా మాట్లాడుతూన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version