ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తాం – సీఎం చంద్రబాబు

-

ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రపతి ముర్ము మంగళగిరి ఎయిమ్స్‌ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ను ఒక ఆదర్శంగా విద్యార్ధులు తీసుకోవాలని… ఒక ఆదివాసీ కుటుంబం నుంచీ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడం ఆవిడ సాధించిన విజయం అని తెలిపారు. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అన్నారు.

We will give 10 acres to AIIMS Mangalagiri said CM Chandrababu

దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు…అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందన్నారు. 960 బెడ్లు ఉన్న ఆసుపత్రి… 1618 కోట్లు ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి.. మంగళగిరి ఎయిమ్స్ అని వివరించారు. డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని డైరెక్టర్ మధవానంద కర్ అంటున్నారని పేర్కొన్నారు. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version