ఆరో విడతలో 61.75 శాతం పోలింగ్‌ నమోదు

-

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ విడతలో హరియాణాలోని మొత్తం 10, దిల్లీలోని మొత్తం 7 స్థానాలు, జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి ఎన్నిక జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో 8, ఝార్ఖండ్‌లో 4, బిహార్‌లో8, ఒడిశాలోని 6 లోక్‌సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దఫా 14 లోక్‌సభ స్థానాలతో పాటు బలరాంపూర్‌లోని గైసారి అసెంబ్లీ స్థానం ఉపఎన్నికకు పోలింగ్‌ నిర్వహించారు. ఆరో విడతలో 60.63 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగానూ శనివారంతో ఆరుదశల్లో 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన ఏడో విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విడతతో పాటే కర్నాల్ అసెంబ్లీ ఉపఎన్నికకు పోలింగ్ కూడా నిర్వహించారు

Read more RELATED
Recommended to you

Latest news