PM Kisan: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..దసరాకు ముందే

-

PM-KISAN 18th instalment to be released on Oct 5: దసరా ముందు దేశ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. ఇవాళ రైతు పెట్టుబడి కోసం పీఎం కిసాన్ పథకం నుంచి నిధులు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది మోడీ ప్రభుత్వం. 18వ విడత నిధులను ఇవాళ రిలీజ్ చేయనుంది. 18వ విడతలో… భాగంగా ఏకంగా 20 వేల కోట్లు ఇవాళ విడుదల చేయబోతుంది మోడీ సర్కార్.

PM-KISAN 18th instalment to be released on Oct 5

ఈ పీఎం కిసాన్ ద్వారా మొత్తం తొమ్మిది కోట్లకు పైగా రైతులు… లబ్ధి పొందడం జరుగుతుంది. ఇవాళ ఈ తొమ్మిది కోట్ల మంది రైతులకు… డబ్బులు జమ చేయనున్నారు. పీఎం కిసాన్.. రైతుబంధు తరహాలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో… 2000 చొప్పున మూడుసార్లు వేస్తున్నారు. అలా ఇప్పటివరకు 17 సార్లు నరేంద్ర మోడీ సర్కార్… రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. ఇవాళ 18వ విడత నిధులు విడుదల కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version