కన్యాకుమారిలో 48 గంటల ధ్యానంలో ప్రధాని మోదీ

-

లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇన్నాళ్లూ బిజిబిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార గడువు తీరడంతో ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమయ్యారు. పంజాబ్‌ హోషియార్‌పుర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన మోదీ ధ్యానం చేసేందుకు కన్యాకుమారికి వెళ్లారు. భగవతి అమ్మాన్‌ మందిరాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన స్థలానికి వెళ్లారు. అక్కడ రాక్‌ మెమోరియల్‌లో మోదీ ధ్యానం చేస్తున్నారు. ప్రధాని మోదీ మొత్తం 45 గంటలు కన్యాకుమారిలో గడిపేలా ప్రణాళికలు రచించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూన్‌ 1 వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు.

ప్రధాని పర్యటన రీత్యా భద్రతా దళాలు, అధికారులు కన్యాకుమారిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 3వేల మందికిపైగా పోలీసులను కన్యాకుమారి, వివేకానందా రాక్‌ మెమోరియల్‌ వద్ద మోహరించారు. భారత నౌకాదళం, కోస్ట్‌ గార్డుతో పాటు తమిళనాడు తీర రక్షణ దళం రంగంలోకి దిగాయి. 3 రోజుల పాటు చేపలవేటను నిషేధించారు. మోదీ ఈసారి కన్యాకుమారిని ఎంపిక చేసుకోవడంపై ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news