AI ఉగ్రవాదుల చేతిలో పడితే ప్రపంచం నాశనం : మోదీ

-

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI) వల్ల ప్రపంచం నాశనమయ్యే అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏఐ ఉగ్రవాదుల చేతిలో పడితే అది ప్రపంచానికే పెద్ద ముప్పు అని హెచ్చరించారు. వివిధ అంతర్జాతీయ సమస్యల కోసం ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు ఉన్నట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని సూచించారు.

దిల్లీలో నిర్వహించిన గ్లోబల్ పార్టనర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 21వ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా మారుతుంది. నాశనం చేయడంలోనూ అంతే శక్తివంతంగా ఉంటుంది. జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించిన సమయంలో ఏఐ కోసం బాధ్యతాయుతమైన, మానవ-కేంద్రీకృత పాలన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని భారత్‌ ప్రతిపాదించింది. అని మోదీ గుర్తు చేశారు.

కృత్రిమ మేధ (ఏఐ) ప్రస్తుత, భవిష్యత్తు తరాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే దీని విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు. ఈ శిఖరాగ్ర సమావేశం నుంచి వెలువడే సూచనలు, ఆలోచనలు ప్రపంచాన్ని ఏఐ చీకటి కోణాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, సవాళ్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయని తాను విశ్వసిస్తున్నానని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news