సొంతిల్లు, కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?

-

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని.. తన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఈ అఫిడవిట్ ప్రకారం మోదీకి సొంత ఇల్లు, కారు కూడా లేదు. ఆయనపై సెంటు భూమి కూడా లేదని మోదీ పేర్కొన్నారు. అయితే తన మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు పైగా ఉన్నట్లు అందులో వెల్లడించారు.

తన ఆస్తిలో ఎక్కువ భాగం (రూ.2.86 కోట్లు) ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు మోదీ తెలిపారు. గాంధీనగర్‌, వారణాసిలో ఉన్న తన బ్యాంకు ఖాతాల్లో రూ.80,304 ఉందని, అవికాక ప్రస్తుతం తన వద్ద రూ.52,920 నగదు, రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు చెప్పారు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌లలో ప్రధాని రూ.9.12 లక్షలు పెట్టుబడి పెట్టగా.. 2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్న తన ఆదాయం 2022-23లో రూ.23.56 లక్షలకు పెరిగినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version