చంద్రబాబు కేబినేట్‌ లో జనసేనకు 3, బీజేపీకి 2 పోస్టులు ?

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎల్లుండి కొలువు తీరనుంది. చంద్రబాబుతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. మొత్తం మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారా..? లేక తొలి విడతలో పరిమిత సంఖ్యతో సరిపెడతారా..? అని తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎంగా పవన్, మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం ఖాయమంటోన్నాయి టీడీపీ – జనసేన వర్గాలు.

3 posts for Jana Sena and 2 posts for BJP in Chandrababu’s cabinet

చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటు బీజేపీ ప్రతినిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. జనసేన – బీజేపీల నుంచి ఎవరెవర్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే అంశంపై జాబితా సిద్దం చేస్తున్నారు ఆయా పార్టీ అగ్ర నేతలు. జనసేనకు మూడు నుంచి నాలుగు, బిజెపికి రెండు బెర్తులు ఖాయమంటోన్నాయి కూటమి వర్గాలు. కెబినెట్లో బీసీలకు హై ప్రయార్టీ ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version