ప్రపంచ వజ్రాల కేంద్రంగా సూరత్ .. సూరత్ డైమండ్ మార్కెట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

-

ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం సూరత్ డైమండ్ బోర్స్- ఎస్డీబీ గుజరాత్ రాష్ట్రంలో కొలువుదీరింది. ఈ సముదాయాన్ని ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. డైమండ్‌ కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా 65వేల మంది వజ్రాల నిపుణులు ఈ కాంప్లెక్స్‌ కేంద్రంగా పని చేయనున్నట్లు మోదీ తెలిపారు.

ఈ అతిపెద్ద కార్యాలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా డైమండ్‌ కట్టింగ్‌ క్యాపిటల్‌గా సూరత్‌ పేరును సుస్థిరం చేయనుందని మోదీ వెల్లిడించారు. ప్రపంచ వజ్రాల కేంద్రంగా భారత్ నిలిచిందని అన్నారు. వజ్రాల పరిశ్రమకు పెద్ద ఊపునిస్తుందని చెప్పారు. ‘కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్’, జ్యువెలరీ మాల్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, సేఫ్ వాల్ట్ సౌకర్యంబోర్స్ లో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయని వివరించారు.

ఎస్డీబీతో పాటు కొత్తగా నిర్మించిన సూరత్ ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్ రద్దీ సమయాల్లో 1200 మంది దేశీయ, 600 విదేశీ ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు. విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ సూరత్ నగరంలో రోడ్ షో నిర్వహించి ప్రజలకు అభివాదం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version