లోక్​సభలో ప్రమాణం చేసిన ప్రధాని మోదీ

-

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ నెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ ఉంటుంది. జులై 2 లేదా 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు బదులిచ్చే అవకాశం ఉంది.

సభ ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన ప్రమాణం చేయించారు. అనంతరం కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, ఫగ్గన్‌సింగ్‌ కులస్తే , నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మనోహర్​ లాల్​ ఖట్టర్, కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు మోదీ పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని అన్నారు. రాజ్యాంగ ప్రొటోకాల్స్‌ పాటిస్తామని తెలిపారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version