అటల్‌ సేతుపై రష్మిక వీడియో.. మోదీ రియాక్షన్ ఇదే

-

వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’పై ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ అటల్‌ సేతును కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతున్న వీడియోను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన ఆనందం ఏముంటుందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ ను జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.  దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ ₹21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన అటల్‌ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు ఉంది. అందులో 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.

https://x.com/narendramodi/status/1791144829336084582?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1791144829336084582%7Ctwgr%5Eaef1887f880d5005f1081172aca83c188b7ec024%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-25890113012752304000.ampproject.net%2F2405022220000%2Fframe.html

Read more RELATED
Recommended to you

Latest news