రిషి సునాక్ కు ప్రధాని మోదీ ఫోన్.. ఆ ఒప్పందంపై సంతృప్తి

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్కు ఫోన్ కాల్ చేశారు. మంగళవారం రోజున సునాక్తో ఫోన్లో మాట్లాడిన మోదీ.. భారత్-యూకేల ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ ‘ఫ్రీ ట్రైడ్ అగ్రిమెంట్’ (FTA)ను వీలైనంత త్వరగా చేసుకోవాలని ఈ ఫోన్కాల్లో ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించినట్లు సమాచారం. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మంచి సంభాషణ జరిగిందని ఫోన్కాల్ అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో షేర్ చేసుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే పరస్పర ప్రయోజనకరమైన ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ వీలైనంత త్వరగా ముగించడానికి కృషి చేస్తామని పునరుద్ఘాటించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య 36 బిలియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్ల విలువ చేసే ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. దాన్ని మరింత విస్తరించేందుకు ఎఫ్‌టీఏ ఒప్పందం చాలా కీలకం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news