రాముడు వివాదం కాదు.. సమాధానం: ప్రధాని మోదీ

-

ఇవాళ దేశంలో నిరాశావాదానికి చోటు లేదని ప్రధాని మోదీ అన్నారు. ఉన్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. దేవ్‌ సే దేశ్‌.. రామ్‌ సే రాష్ట్ర్‌.. ఇదే మన కొత్త నినాదం అని పేర్కొన్నారు. రాముడు అగ్ని కాదు.. రాముడు వెలుగు అని అభివర్ణించారు. శ్రీరాఘవుడు వివాదం కాదని.. ఆయనే ఓ సమాధానం అని ప్రధాని మోదీ తెలిపారు. ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదని దేశ విశ్వాసాలకు ప్రాణప్రతిష్ట అని చాటిచెప్పారు. ఇది కేవలం ఆలయమే కాదని భారత చైతన్యానికి ప్రతీక అని వెల్లడించారు.

“రాముడే భారత్‌ ఆధారం.. రాముడే భారత్‌ విధానం. రాముడే భారత్‌ ప్రతాపం.. రాముడే భారత్‌ ప్రభావం. రాముడే విశ్వం.. రాముడే విశ్వాత్మ. రాముడే నిత్యం.. రాముడే నిరంతరం. త్రేతాయుగం నుంచి ఇప్పటివరకు రాముడిని ఆరాధిస్తున్నాం. రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి” అని అయోధ్య రామమందిరం నుంచి ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version