ప్రపంచానికి స్మార్ట్‌ గవర్నెన్స్ అవసరం: ప్రధాని మోదీ

-

యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ గవర్నమెంట్ సమ్మిత్‌-2024లో పాల్గొని ప్రసంగించారు. ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్‌ ప్రభుత్వాలు అవసరమని మోదీ అన్నారు. గత పదేళ్లుగా మినిమమ్‌ గవర్నమెంట్‌, మాగ్జిమమ్‌ గవర్నెన్స్‌ (కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన) నినాదంతో భారత ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. యూఏఈ దేశాధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వంలో దుబాయ్‌ ప్రపంచ ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా మారుతోందని ప్రశంసించారు.

ప్రజల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే భారత ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఏర్పడిందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. తమ సర్కార్ మహిళాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, వారిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఆధునికతవైపు దూసుకుపోతున్న ప్రపంచానికి దశాబ్దాలుగా ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఇంధనం, నీరు, ఆహార భద్రత రూపంలో అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయన్న మోదీ.. మరోవైపు సాంకేతికత మనిషిని అభివృద్ధివైపు నడిపిస్తూనే.. అంతరాయాలను సృష్టిస్తోందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news