యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయాన్ని 402 స్తంభాలపై అబ్బురపరచే హిందూ దేవతామూర్తులతో తీర్చిదిద్దారు. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామినారాయణ్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. 108 అడుగులు ఎత్తు- 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్లు ఉపయోగించారు.
ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..?
- అబుదాబిలో బాప్స్ నిర్మించిన హిందూ ఆలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది.
- అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు పలు దేవుళ్ల కథలు వర్ణన.
- ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్టులు, లైబ్రరీ ఏర్పాటు.
- భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై డేటాను సేకరించనున్న సెన్సార్లు.
- విడిభాగాలను రెండేళ్లుగా ఒకే చోట చేర్చిన ఎమిరేట్స్ కళాకారులు.
- హిందూ శాస్త్రాలకు అనుగుణంగా పూర్తి సహజంగా నిర్మితమైన మందిరం.
- మందిరానికి కావాల్సిన భూమిని ఇచ్చిన యూఏఈ అధ్యక్షుడు.
- ఏడు ఎమిరేట్స్‌ను సూచించేలా ఏడు ఆలయ గోపురాలు.
- ఆలయం ప్రారంభోత్సవానికి ముందు అక్కడి పురోహితులు ప్రత్యేక యజ్ఞాలు.
- ప్రపంచానికి ఐక్యతను, సామరస్యాన్ని చాటిచెప్పడమే ఈ దేవాలయ ఉద్దేశం.