నేడే భారతప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారం

-

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పట్టాభిషేకం ఇవాళ (జూన్ 9వ తేదీ) జరగనుంది. ఆదివారం రాత్రి 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో భారతప్రధానిగా నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు. దీనికి సంబంధించి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని ప్రముఖులతో పాటు విదేశీ నేతలు కూడా హాజరుకానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ దిల్లీ చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేతలకు ఇంకా ఆహ్వానం అందలేని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తేలిపారు.

మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news