భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపర్చడం కోసమేనని తెలిపారు. ఈ పదవీకాలాన్ని తొమ్మిదేళ్ల సేవగా అభివర్ణించారు.
‘దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో నేనెంతో వినమ్రత, కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి చర్య.. ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించినవే. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించేందుకు ఇంతకంటే ఎక్కువగా శ్రమిస్తాను’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఇక తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఇవాళ భారీ ప్రచార కార్యక్రమాలకు తెరతీసింది. ‘స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్’పేరిట నెల రోజుల పాటు దీనిని నిర్వహించనుంది. ‘నేషన్ ఫస్ట్’అనే నినాదంతో ఈ సమయంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని బీజేపీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
9 years of unwavering dedication to the nation’s growth.
I invite everyone to visit this site https://t.co/jWxyZLPPcU to get a glimpse of our development journey. It also gives an opportunity to highlight how people have benefited from various Government schemes. #9YearsOfSeva
— Narendra Modi (@narendramodi) May 30, 2023