దేవభూమిలో ప్రధాని పర్యటన.. ఆదికైలాస పర్వతంపై మోదీ ప్రత్యేక పూజలు

-

దేవభూమి ఉత్తరాఖండ్‌లోప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దేవభూమిలో ప్రత్యేక పూజలు చేశారు. పిథోర్‌గఢ్‌లో ఆయన పూజలు నిర్వహించారు. పరమ శివుడి నివాస స్థలంగా భావించే ఆదికైలాస పర్వతంపై ఆయన పూజాదికాలను నిర్వహించారు. స్థానిక సంప్రదాయ దుస్తులను ధరించిన ప్రధాని మోదీ ఆది దేవుడికి హారతి ఇచ్చారు.

ఒక రోజు పర్యటన కోసం ఉత్తరాఖండ్ వెళ్లిన ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పిథోరాగఢ్‌లో సుమారు రూ. 4200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. గుంజి గ్రామానికి వెళ్లి స్థానికులతో ముచ్చటించనున్నారు. స్థానిక కళలు, చేతివృత్తుల ప్రదర్శనను తిలకించనున్నారు. సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌, సరిహద్దు రోడ్డు నిర్వహణ సంస్థ- బీఆర్ఓ ప్రతినిథులతో కూడా మోదీ మాట్లాడనున్నారు.

ఆది కైలాశ్​ను సందర్శించిన తరువాత ప్రధాని మోదీ.. చారిత్రక నగరం అల్మోరాలోని జగేశ్వర్ ధామ్‌కు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మళ్లీ పిథోరాగఢ్​కు వెళ్లి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో పాటు ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version