45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ.. ద్రవమే ఆహారం

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద గురువారం సాయంత్రం నుంచి ధ్యానంలో కూర్చున్న విషయం తెలిసిందే. ఆయన ఇక్కడే 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. గురువారం సాయంత్రం 6.45 గంటల సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు.

ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మోదీకి అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారు. మెడిటేషన్ హాల్‌ నుంచి 45 గంటల వరకు ఆయన బయటకు రారు. ఆయన కాషాయ దుస్తులు ధరించి, ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. ఇదిలా ఉంటే.. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news