ప్రధాని నరేంద్రమోడీ నేడు మన్‌కీబాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 11గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులమీద ఆయన ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా కరోనా మహమ్మారి కట్టడి, అన్‌లాక్ ప్రక్రియ, దేశ ఆర్థిక పరిపుష్టి తదితర విషయాలపై ప్రధాని మోడీ ప్రజలకు చెప్పనున్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
అంతేగాకుండా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జాతీయ విద్యావిధానం, ప్రాధాన్యం, అమలుపై మాట్లాడుతారని అంచనావేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్రమోడీపై విపక్షలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కరోనా కట్టడిలో ఆయన ఘోరంగా విఫలం చెందారని మండిపడుతున్నాయి. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.