మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం భారీ రాజకీయ సంక్షోభంలో ఉన్న వేళ, ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2020 సెప్టెంబర్ 9న ముంబైలో కంగనారనౌత్ నివాసం ముందు అలజడి మొదలైంది. ముంబై మహా నగర పాలక సంస్థ అధికారులు కంగనా కు చెందిన భవనంలో కొంత భాగాన్ని యంత్రాలతో కూల్చివేశారు.
భవనంలో అక్రమంగా మార్పులు చేశారని, అందుకే దీన్ని కూల్చివేస్తున్నామని మున్సిపల్ అధికారులు వివరణ ఇచ్చారు. కంగనా ఆ భవనాన్ని అప్పటికి కొన్ని రోజుల ముందే రూ .48 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. తన ఇల్లు కూల్చివేత కు సంబంధించిన చిత్రాలను కంగనారనౌత్ ట్వీట్ చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని ఆమె పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చారు.
” నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ముంబై అనేది మరో పీవోకే అనే విషయాన్ని నా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. బాబర్ అతడి సైన్యం అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫోటోలను ఆమె షేర్ చేశారు.
నా ఇల్లు కూల్చినట్లు గానే.. త్వరలో ఉద్దవ్ అహంకారం కూడా కూలిపోతుంది. అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు కంగనా. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#UddhavThackarey
Only #KanganaRanaut has the power to predict 🙄 pic.twitter.com/IaatY1Dpgr— Biraja Prasad Rath (@iambiraja) June 22, 2022