బిజినెస్ ఐడియా: ఎక్కడున్నా సులువుగా నెలకు లక్ష ఆదాయం..అద్బుతమైన వ్యాపారం..

-

ఉద్యోగాలలో పురొగతి లేకపోవడంతో యువత ఇప్పుడు బిజినెస్ పై మొగ్గు చూపుతున్నారు..సులువుగా లక్షలు సంపాదించాలి అనుకుంటే మాత్రం మీకో బెస్ట్ ఐడియా ఉంది అదే సోలార్ పవర్ ప్లాంట్..కేంద్ర ప్రభుత్వం కూడా సౌర విద్యుత్తు పథకాన్ని ప్రోత్సహిస్తోంది. అంతే కాదు బ్యాంకులు కూడా సోలార్ ప్యానెళ్లకు సులభ వాయిదాల్లో రుణాలు అందజేస్తున్నాయి. దీనికి సబ్సిడీ కూడా లభిస్తుంది. మీ ఇంటిలో ఖాళీగా ఉన్న పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సోలార్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా 30 వేల రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కిలోవాట్‌కు 60-80 వేల రూపాయల వరకుపెట్టుబడి పెట్టాలి. రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీని ఇస్తుంది. సబ్సిడీ లేకుండా సోలార్ ప్యానెళ్లను అమర్చాలంటే ఒక కిలో వాట్‌కు దాదాపు రూ.లక్ష ఖర్చు అవుతుంది. సోలార్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత.. దానిని యూనిట్ చొప్పున అమ్ముకోవచ్చు. పవర్ గ్రిడ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే ప్రైవేట్ సంస్థలకు విద్యుత్‌ను అమ్మవచ్చు.అప్పుడు ఇంకాస్త ఆదాయం వస్తుంది.

ప్రైవేట్ కంపెనీలు, డీలర్ల వద్ద కూడా సౌర పలకను కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పుపై 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను అమర్చినట్లయితే… రోజుకు దాదాపు 10 యూనిట్ల చొప్పున, నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మీరు 100 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తే,1500 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు మీ అవసరాలకు వాడుకొని.. మిగతా కరెంటును అమ్ముకోవచ్చు.గతంలో సోలార్ ప్లాంట్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం కేంద్రం చొరవ తీసుకోవడంతో రుణాలను మంజూరు చేస్తున్నాయి..పెద్ద మొత్తంలో ఈ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తే మరిన్ని లాభాలు వస్తాయి..అంటే లక్షల్లో ఆదాయం అన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version