Polling for 24 Assembly constituencies across Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా…కాసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభం అయింది. జమ్మూ కాశ్మీర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత J&Kలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా విస్తృతంగా భద్రత ఏర్పాట్లు చేశారు. బహుళ అంచల భద్రతను ఏర్పాటు చేసినట్లు కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బిర్డి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇదే కావడం విశేషం. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ, 25వ తేదీ, అక్టోబర్ 1వ తేదీన 3 దశలలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.