బెంగళూరులో బిహార్ సీఎం నితీశ్​కు సెగ.. రాత్రికి రాత్రే పోస్టర్ల కలకలం

-

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి. తమ కూటమికి INDIA(ఇండియన్ నేషనల్ డెవెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌)గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఇండియా, ఎన్​డీఏ మధ్యే జరుగుతాయని తెలిపారు. ఇండియావైపు నిలబడేవారు.. తప్పక విజయం సాధిస్తారని బెంగళూరులో రెండురోజుల చర్చలు 26 పార్టీల ముఖ్యనేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భేటీలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

విపక్షాల ఐక్యత సమావేశాల్లో పాల్గొన్న నితీశ్​కు వ్యతిరేకంగా బెంగళూరులో పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రి పోస్టర్లు వెలిశాయి. వంతెనలు కూడా కట్టలేని సీఎం.. ప్రధాన పదవి రేసులో ఉన్నారా అంటూ ఎద్దేవా చేస్తున్నట్లు ఆ పోస్టర్లలో కనిపించింది. బిహార్‌లో నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌ గంజ్‌ వంతెన.. ప్రారంభానికి ముందుగానే కుప్పకూలిందని, ఒక వంతెన నిర్మించలేని వ్యక్తి ప్రధానమంత్రి స్థానానికి పోటీ పడతారా అని దానిలో ప్రశ్నించారు. రేస్‌ కోర్సు రోడ్డు, సమావేశాలు జరుగుతున్న హోటల్‌ చుట్టుపక్కల, స్యాంకీ రోడ్డులో ఈ తరహా పోస్టర్లు కనిపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version