టీచర్​గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పిన రాష్ట్రపతి  ముర్ము

-

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తనకెంతో ఇష్టమైన వృత్తి టీచర్ గా మారి పాఠాలు చెప్పారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లిన ఆమె తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తొలుత విద్యార్థుల పేర్లు అడిగిన ముర్ము వారి అభిరుచులు, లక్ష్యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలు విని ఆమె ఆశ్చర్యపోయారు. నేటి తరం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉందని అన్నారు. తమ భవిష్యత్ ఎలా ఉండాలో, దానికోసం ఏం చేయాలో నేటి విద్యార్థులకు చిన్న వయసులోనే పూర్తి స్పష్టత ఉందని పేర్కొన్నారు. ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, సాంకేతికంగా వీరికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ముర్ము అన్నారు.

గ్లోబల్‌ వార్మింగ్‌పై విద్యార్థులకు ద్రౌపది ముర్ము పాఠాలు చెప్పారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే నేటి మన ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నీటి సంరక్ష ప్రాధాన్యతను వివరించారు.  పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ (అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి)’ గురించి ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version