తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్‌ సీట్లు..!

-

తెలంగాణ బీటెక్ విద్యార్థులకు అలర్ట్.  రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్‌ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మొదలై.. 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇవాళ లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఇవ్వనుంది.

డిమాండ్‌ లేని బ్రాంచీల స్థానంలో సీఎస్‌ఈ తదితర బ్రాంచీల ద్వారా సుమారు 7,000 సీట్లు, అదనపు సీట్లతో కొత్తగా 20,500 అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. అయితే తొలివిడత కౌన్సెలింగ్‌లో సుమారు 2,600 సీట్లకు అనుమతి ఇచ్చిన సర్కార్.. తాజాగా రెండో విడతకు సుమారు 9,000 వరకు మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. అంటే దాదాపు సగం సీట్లకు కోత పెట్టినట్లేనని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 75,200 మందికి బీటెక్‌ సీట్లు పొందగా 55,000 మంది రిపోర్టింగ్‌ చేశారు. మరో 20 వేల మంది సీట్లు వదులుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version