ఆస్ట్రేలియా టీంకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వన్డే ప్రపంచకప్ లో అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘ఈ టోర్నీలో బాగా ఆడారు. అద్భుత విజయంతో ముగించారు. సెంచరీతో రాణించిన ట్రావిస్ హెడ్ కు ప్రత్యేక అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

మరోవైపు ఈ మెగా టోర్నీలో టీమిండియా ప్రతిభ, సంకల్పం చెప్పుకోదగినదని కొనియాడారు. మీ పోరాట స్ఫూర్తిపై గర్వంగా ఉందని…. మేమంతా మీ వెంటే ఉంటామని తెలిపారు. కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని నాలుగు తప్పిదాలు శాసించాయి. టాస్ ఓడిపోవడం నుంచి ట్రావిస్ హెడ్ అసాధారణ ప్రదర్శన వరకు టీమిండియాకు అన్ని ప్రతికూలంగానే మారాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ మందకోడిగా ఉన్న పిచ్ పై చెలరేగింది. ఈ ప్రపంచకప్ లో సత్తా చాటిన టీమిండియా టాపర్డర్…. ఈ మ్యాచ్ లో తేలిపోయింది.