చంద్రయాన్-4పై ఇస్రో ఫోకస్.. జాబిల్లి నుంచి మట్టి తీసుకురావడమే టార్గెట్

-

చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించిన భారత్​.. ఇప్పుడు మరో అరుదైన ప్రయోగానికి కసరత్తు చేస్తోంది. చంద్రయాన్-3ని సక్సెస్​ఫుల్​గా జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్​ల్యాండ్ చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు చంద్రయాన్-4 ప్రయోగంతో మరో లక్ష్యాన్ని చేధించే పనిలో పడింది. లుపెక్స్‌ పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టిని తీసుకొచ్చేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని స్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ వెల్లడించారు.

చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్ధమవుతున్నామని నీలేశ్‌ దేశాయ్‌ తెలిపారు. దీనికోసం లునార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రయాన్‌-4లో జాబిల్లి ఉపరితలంపై 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగనుందని వెల్లడించారు. 350 కేజీల బరువు ఉన్న రోవర్‌ను ఇందులో పంపనున్నట్లు వివరించారు. ఇది కిలో మీటరు మేర చంద్రుడిపై తిరుగనుందని స్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news