Pune Road Rage: కారుకు సైడ్ ఇవ్వలేదని.. మహిళ ముక్కు పగిలేలా కొట్టిన వ్యక్తి !

-

 

Pune Road Rage: కారుకు సైడ్ ఇవ్వలేదని.. పిడి గుద్దులతో మహిళ ముక్కు పగిలేలా కొట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్ర లోని పుణెలో జరిగింది. ఈ సంఘంటా వివరాలు ఇలా ఉన్నాయి.పుణెలో 27 ఏళ్ల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీలో బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్ టేక్ చేశాడు.

Pune Road Rage Elderly Motorist ‘Punches’ Woman On Scooter With 2 Kids, Left Her ‘Bleeding’

 

ఒక్కసారిగా స్కూటీ ముందు కారు ఆపి ఆమె జుట్టు పట్టుకొని ముక్కుపై పిడిగుద్దులు కురిపించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె ముక్కు నుంచి రక్తం కారింది. జరిగిన విషయాన్ని వివరిస్తూ సదరు మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దారివ్వలేదని ఆరోపిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version