ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుందట. లోక్ సభ స్పీకర్ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు ఫైనల్ చేసింది బీజేపీ. దీనిపై మరికాసేపట్లోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.
- దగ్గుబాటి పురంధేశ్వరి
- పుట్టిన తేదీ – 22 ఏప్రిల్, 1959
- తల్లిదండ్రులు – నందమూరి తారక రామారావు,
బసవతారకం - చదువు – బి.ఎ లిటిలేచర్
- రాజకీయ ప్రవేశం –
2004లో కాంగ్రెస్ లో చేరి బాపట్ల ఎంపీగా గెలుపు,
2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపు - 2014లో ఏపీ విభజన తర్వాత బిజెపిలో చేరిక
- 2019లో రాజంపేట ఎం.పి. స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి
- 2023లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరణ
- 2024 లో. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా గెలుపు
- కాగా, కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వాళ్లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. వారిలో టీడీపీ ఎంపీలు కే.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అదేవిధంగా నితిన్ గడ్కరీ, శర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, జితేంద్ర సింగ్, హెచ్‌డీ కుమార స్వామి(జేడీఎస్), ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన షిండే వర్గం)లకు ఫోన్ వచ్చింది. కాగా వీరికి మోదీ తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు.