నేటి నుంచి అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఫిక్స్‌ అయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు అమెరికాకు వెళ్ళనున్నారు. 10 రోజులపాటు యుఎస్ లో పర్యటిస్తారు. జూన్ 4న న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు.

ఈ కార్యక్రమంతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలో నిర్వహించే ప్యానల్ డిస్కషన్ కు హాజరవుతారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీకి పదేళ్ల కాల పరిమితి ఉండే ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ మంజూరుపై సుబ్రమణ్యస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఏడాది కాలానికే పాస్‌పోర్ట్‌ మంజూరు చేయాలని, అవసరం మేరకు దానిని మరో ఏడాదికి పొడిగించాలని ఢిల్లీ కోర్టును కోరారు. అయితే పదేళ్ల ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ కోసం రాహుల్‌ గాంధీ తరుఫు న్యాయవాదులు కోర్టులో పట్టుబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version