పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించడంతో రాహుల్ సుప్రీం తలుపు తట్టారు. ఈ మేరకు సుప్రీంలో రాహుల్ స్టే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు త్వరలోనే విచారించనుంది.
2019 ఏప్రిల్ 13న కర్ణాటక ఎన్నికల ర్యాలీలో దొంగలందరికి మోదీ ఇంటి పేరే ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం కేసు నమోదు కాగా.. విచారించిన గుజరాత్ కోర్టు ఈ ఏడాది మార్చిలో రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ క్రమంలో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు లోక్‌సభ సభ్యత్వం రద్దు అయింది. ఈ తీర్పుపై స్టే వస్తే రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. గుజరాత్ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో రాహుల్ గాంధీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.