నేడు జమ్మూకశ్మీర్‌కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని రాహుల్ పరిశీలించనున్నట్టు సమాచారం అందుతోంది. అనంత్‌నాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు రాహుల్ గాంధీ.
అటు ఉగ్రదాడిపై నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఉగ్రదాడిని ఖండించారు ఆల్ పార్టీల నేతలు. ఉగ్రవాదుల దాడి వివరాలను అఖిలపక్షానికి వివరించారు రాజ్‌నాథ్ సింగ్. జమ్మూ కశ్మీర్ లో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు ఖర్గే. బీజేపీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఈ తరుణంలోనే నేడు జమ్మూకశ్మీర్‌కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని రాహుల్ పరిశీలించనున్నట్టు సమాచారం అందుతోంది.