బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మోదీ జీ మీరు రెడీయా : రాహుల్ గాంధీ

-

సార్వత్రిక ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఈ అంశంపై ఇద్దరు నేతల మధ్య బహిరంగ చర్చ జరగాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ అజయ్‌ పి.షా, ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్‌లు రాసిన లేఖపై రాహుల్ స్పందించారు. లోక్సభ ఎన్నికల వేళ విశ్రాంత న్యాయమూర్తుల చొరవను ప్రశంసిస్తూ, ప్రధాని మోదీ కూడా ఇందులో భాగమవుతారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

బహిరంగ చర్చకు సంబంధించి అందిన ఆహ్వానంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడానని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ఒకే వేదికపై నుంచి ప్రధాన పార్టీలు తమ దార్శనికతను దేశం ముందు ఉంచడం మంచి ప్రయత్నం అవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలపై మోపిన నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా ఇది కీలకంగా మారుతుందని, తాను లేదా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఈ ఉపయోగకరమైన, చరిత్రాత్మక చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news