రీల్స్ పిచ్చిలో కూతురు ప్రాణాలను పణంగా పెట్టిన తండ్రి

-

రీల్స్ పిచ్చిలో కూతురు ప్రాణాలను పణంగా పెట్టాడు తండ్రి. రీల్స్ కోసం కూతురిని ప్రమాద స్థాయిలో ఉన్న ఒక రిజర్వాయర్ పై బలవంతంగా కూర్చబెట్టాడు తండ్రి. రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ జిల్లా బంద్ బరైతా రిజర్వాయర్ పై ప్రమాద స్థాయిలో ఉన్న ఇనుప ఫ్రేమ్ పై రీల్స్ కోసం తమ కూతురిని కూర్చోబెట్టాడు ఉమాశంకర్ దంపతులు.

The father who risked his daughter's life in a reels madness
The father who risked his daughter’s life in a reels madness

భయపడుతున్నా కూడా తమ కూతురిని బెదిరించి ఇనుప ఫ్రేమ్ పై కూర్చోబెట్టారు ఉమ శంకర్. కిందపడకుండా పట్టుకునేందుకు కనీస రక్షణ లేకుండా ఉన్న ఇనుప ఫ్రేమ్ పై తన కూతురిని కూర్చోబెట్టి తీసిన రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌‌లో అప్‌లోడ్ చేసాడు ఉమా శంకర్. దీంతో లైక్స్, వ్యూస్ కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టడం ఏంటని నిలదీసారు నెటిజన్లు. ఇక నెటిజన్ల నుండి వస్తున్న విమర్శలు చూసి వీడియో డిలీట్ చేశారు ఉమా శంకర్.

Read more RELATED
Recommended to you

Latest news