భార్యకు కడుపు చేసిరాపో : జీవిత ఖైదీకి 15 రోజుల బెయిల్ !

-

సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకునేందుకు జీవిత ఖైదీగా ఉన్న భర్తను విడుదల చేయాలంటూ ఖైదీ భార్య దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు జోధ్పూర్ విచారణ చేసింది. ఓ తీవ్ర నేరానికి సంబంధించి నందా లాల్ కు 2019లో భిల్వరా కోర్టు జీవిత ఖైదు విధించింది.

కాగా అతని భార్య పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఫర్ జాంద్ ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తమ తీర్పును వెల్లడించాయి. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఖైదీ నందలాల్ భార్య అమాయకురాలు. భర్త జైల్లో ఉండటం వల్ల శృంగారానికి దూరం అయ్యింది. సంతానం పొందే హక్కు ఖైదీకి కూడా ఉంటుంది. ఆయా కేసుల్లో వాస్తవాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే నందాలు కు 15 రోజుల బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news