రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే : ఆర్బీఐ

-

రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు నోట్లు బ్యాంకుల్లో మార్పిడి అయ్యాయి. అయితే రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా వెల్లడించింది. వ్యవస్థలో చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో,   97.26 శాతమే వెనక్కి వచ్చాయని తెలిపింది. రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని పేర్కొంది.

రూ.2000 నోటును చలామణి నుంచి వెనక్కి తీసుకోనున్నట్లు మే 19న ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 మే 19న వ్యాపార సమయం ముగింపు నాటికి మొత్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉండగా.. 2023 నవంబరు 30 నాటికి ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.9,760 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ వెల్లడించింది. రూ.2000 బ్యాంకు నోట్ల చెల్లుబాటును రద్దు చేయలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు రూ.2000 నోట్లను డిపాజిట్ చేయొచ్చని తెలిపింది. లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news