ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటన చేసి…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ ఊరటనిచ్చాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. 2024–25లో 83,118.13 మిలియన్ యూనిట్ల అవసరం ఉంటుందని…ఈ లెక్కన కొనుగోలు ఖర్చే రూ.39,017.60 కోట్లు అవుతుందని పేర్కొన్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు.
మొత్తం ఖర్చులన్నీ తీరాలంటే రూ.రూ.56,576.03 కోట్ల రాబడి అవసరం అని తెలిపాయి. కానీ అన్ని విధాలుగా వచ్చే ఆదాయం రూ. 42,697.92 కోట్లేనని విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. డిస్కంలకు ఈ సారి కూడా రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నాయి. అయినప్పటికీ ఏ వర్గంపైనా వచ్చే ఏడాది విద్యుత్ చార్జీల భారం పడదని వెల్లడించాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. దింతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత, రాయితీ విద్యుత్ కొనసాగనుంది. ఏపీఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో స్పష్టం చేసిన డిస్కంలు..ఈ ప్రకటన చేశాయి.