చంపే ముందు టార్చర్.. రేణుకాస్వామి ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలన విషయాలు

-

కర్ణాటక చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చింది. అతడి చంపే ముందు చిత్రహింసలకు గురి చేసినట్లు ఈ నివేదికలో వెల్లడైందని సిట్ అధికారులు తెలిపారు. న్యాయస్థానంలో దాఖలు చేయనున్న అభియోగపత్రంతో పాటు ఈ రిపోర్ట్ను పొందుపరుస్తామని చెప్పారు.

రేణుకా స్వామిని ఛాతీపై కొట్టడం వల్ల ఎముక విరిగి, ఊపిరితిత్తికి గుచ్చుకుందని ఈ రిపోర్టులో తేలినట్లు వెల్లడించారు. మినీ లారీకి రేణుక స్వామి తలను కొట్టడం వల్ల తలకు, వెన్నుపూసకు గాయాలయ్యాయని.. కాలితో తన్నడం వల్ల మర్మాంగాలకు గాయాలై, రక్తస్రావం జరిగిందని… మోకాలు విరిగి, కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని రిపోర్టులో తేలినట్లు వివరించారు.

చిత్రహింసలకు తాళలేక, శరీరం లోపల అవయవాలకు గాయాలు కావడం వల్లే అతను మరణించాడని ఫోరెన్సిక్‌ నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారని సిట్ అధికారులు తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో రెండో నిందితుడుగా నటుడు దర్శన్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే హత్య తర్వాత దర్శన్తో కలిసి చర్చలు జరిపిన కర్ణాటక హాస్య నటుడు చిక్కణ్ణకు విచారణకు హాజరు కావాలని ప్రత్యేక దర్యాప్తు దళం నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version