ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. ఇటీవల ఈ కంపెనీ ఫ్రెషర్ల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్లో ఫ్రెషర్‌కు ఏడాదికి రూ.2.5 లక్షలు ఇస్తామని పేర్కొంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోల్స్తో ఆటాడేసుకుంటున్నారు.
2024 గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఫ్రెషర్ల నుంచి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తూఆగస్టు 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా అనే ఎక్స్ పేజీ ఈ జాబ్ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దాదాపు 2 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఈ పోస్టుపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఏడాదికి రూ.2.52 లక్షలు అంటే.. నెలకు సుమారు రూ.20వేలు. ఓ పనిమనిషి ఒక్కో ఇంట్లో సగటున 30 నిమిషాలు చొప్పున రోజుకు 8-10 ఇళ్లల్లో పనిచేస్తే ఇంతకంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తుందంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.