మయన్మార్ లో మహా విషాదం చోటు చేసుకుంది. మయన్మార్ లో భూకంపం కారణంగా మృతుల సంఖ్య 2000 దాటింది. నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు… బయటపడుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. మృతుల సంఖ్య 2,056కి చేరినట్టు సమాచారం అందుతోంది.

ఈ భూకంప ధాటికి 3900 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది మయన్మార్ సైనిక ప్రభుత్వం. 270 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు, NDRF నేతృత్వంలో మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.