హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనపై పోలీసులకు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉన్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ ఎక్కడ జరగలేదని మాదాపూర్ డిసిపి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. విద్యార్థులను కొందరు బయట వ్యక్తులు రెచ్చగొడుతున్నారని… మొన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు కంచ గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా… బయట వ్యక్తులు దాడులకు దిగినట్లు మాదాపూర్ డిసిపి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై రాళ్లు అలాగే కర్రలతో దాడికి పాల్పడినట్లు… తమ రిపోర్టులో ప్రకటన చేశారు. ఈ తరుణంలోని 53 మందిని అదుపులోకి తీసుకొని పర్సనల్ బాండ్ మీద వదిలేశామన్నారు డిసిపి. రోహిత్ అలాగే నవీన్ కుమార్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
HCU ఘటనపై పోలీసుల ప్రకటన
HCUలో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగలేదు
విద్యార్థులను కొందరు బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారు
నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు కంచ గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారు
ప్రభుత్వ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు
దాడిలో… https://t.co/xNNL4ojlGu pic.twitter.com/mpslHeuhXs
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2025