ఎల్లుండి ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు శుబ్ మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ కు విశ్రాంతి ఇవ్వాలని భారత మేనేజ్మెంట్ నిర్ణయించింది. దీంతోవారు రాజ్కోట్ కు బయలుదేరలేదు. నేరుగా గౌహతిలో వరల్డ్ కప్ జట్టుతో కలుస్తారు. కాగా, ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో 74, 104 స్కోర్లతో గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ, రోహిత్, హార్దిక్ లు మూడో మ్యాచులో ఆడనున్నారు.
కాగా ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్ విజయం సాధించింది. ఆదివారం రోజున ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో డక్వర్తులు పద్ధతి ప్రకారం 99 పరుగుల తేటతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్మిత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 39 పరుగులు చేసింది. ఆటో లక్ష్య చేతనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 217 పరుగులకే అల్ ఔట్ అయింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలవడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.